
* ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
* విజేతలకు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి లోకేవ్
ఆకేరు న్యూస్, అమరావతి : ఏపీలో ఇంటర్ ఫలితాలను మంత్రి లోకేశ్ (LOKESH) ఈరోజు ఉదయం విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండో ఏడాదిలో 83 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. https://resultsbie.ap.gov.in వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మన మిత్ర వాట్సప్ నంబర్ (WATSUP NUMBER) 95523 00009కు హాయ్ అని పంపితే చాలు ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్, జూనియర్ ఇంటర్ కలిపి మొత్తం 10 లక్షల 17 వేల102 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేష్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఫీజులు చెల్లించవచ్చు. ఏప్రిల్ 22వ తేదీ వరకు గడువు ఉంటుందని పేర్కొంది. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ (SUPPLEMENTARY) పరీక్షలు మే 12 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఉదయం 9గంటల నుంచి 12 గంటలకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
……………………………………