* దొంగతనానికే అవే బెస్ట్
* పోలీసులకు చిక్కిన ఖరీదైన దొంగ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: దొంగతనాల్లో కూడా తన దర్జాను కాపాడుకున్నాడు. బస్సులు, రైళ్ళల్లో పేదలు, దిగువ మద్యతరగతి ప్రజలు ఉంటారు. రిస్క్ చేసి దొంగతనానికి పాల్పడినప్పటికీ పెద్దగా గిట్టుబాటు కాదని ఆలోచించాడు. ఏకంగా విమానాలనే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. విమాన ప్రయాణికులైతే ఎగువ మద్యతరగతి, ధన వంతులు ప్రయాణిస్తారు. విమాన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని లక్ష్యల రూపాయలు కొట్టేశాడు. విలువైన బంగారు ఆభరణాలను తస్కరించాడు.. ఢిల్లీ పహర్ గంజ్‌కు చెందిన రాజేష్ కపూర్ అనే 40 ఏళ్ళ వ్యక్తి విమానాల్లో దొంగతనాలు చేస్తూ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో చిరు వ్యాపారాలు చేసినప్పటికి రాజేష్ అవసరాలకు సరిపోను ఆదాయం రాలేదు. ఇక ఇలాంటి వ్యాపారాలు లాభం లేదనుకుని దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. మొదట్లో రైళ్లల్లో దొంగతనాలు ప్రారంభించాడు. అయినప్పటికీ పెద్దగా రాబడి లేదని భావించాడు. ఇక లాభం లేదనుకుని విమాన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేశాడు. ఏడాదిలోపే ఏకంగా 200 విమానాల్లో ప్రయాణించి చోర కళ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.
* కనెక్టింగ్ ఫ్లైట్సే టార్గెట్
సీనియర్ సిటిజన్స్ ప్రయాణించే కనెక్టింగ్ ఫ్లైట్స్ లక్ష్యంగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టేవాడు. వారితో పరిచయం పెంచుకునే స్నేహ పూర్వకంగా మసలే వాడు. విమాన సిబ్బందిని ఒప్పించి టార్గెట్ చేసిన సీనియర్ సిటీజన్స్ పక్క సీటు లో కూర్చునే వాడు. వారు బాత్ రూమ్‌కు వెళ్ళినప్పుడు బ్యాగులోంచి విలువైన బంగారు ఆభరణాలు , ఇతర విలువైన వస్తువులను దొంగిలించేవాడు. వరుసగా విమానాల్లో దొంగతనాల గురించి ఫిర్యాదులు రావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధితుల పక్క సీట్లల్లో అనుమానస్పందంగా కనిపించిన రాజేష్ పై పోలీసులు దృష్టి సారించడంతో అసలు విషయం వెల్లడయింది. 110 రోజుల్లో ఏకంగా 200 విమానాల్లో ప్రయాణించినట్టు గుర్తించిన పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన పద్దతుల్లో విచారించారు. ఢిల్లీలో ఖరీదైన గెస్ట్ హౌజ్ కూడా రాజేష్‌కు ఉన్నట్లు గుర్తించారు. దొంగిలించిన బంగారు ఆభరణాలు చాలా వరకు అమ్మేసాడని పోలీసులు తెలిపారు.
————————————-