* ఇద్దరు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
* హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్‌కు వెళుతుండగా ఘటన
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : బస్సు ప్రయాణమంటే ప్రయాణికులు హాడలిపోతున్నారు. రోజుకో ప్రమాదం సంభవిస్తుండడంతో ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేరేడిగొండ మండలం బోథ్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌కు వెళుతున్నట్లు సమాచారం. మృతుల, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………………..
