
* హాలీ డే ఫామ్ హౌస్‌లో ముజ్రా పార్టీ కలకలం
* గంజాయి, మద్యం సీజ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ (Mujra Parry) కలకలం సృష్టించింది. నిన్న అర్ధరాత్రి హాలీ డే ఫామ్ హౌస్ పై పోలీసుల దాడితో ముజ్రా పార్టీ వెలుగులోకి వచ్చింది. ఏడుగురు యువతులు, 14 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెజ్ట్ 70 గ్రాముల గంజాయి, మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఏతబర్‌పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బర్త్ డే సెలబ్రెషన్స్ (Birthday Celebrations) పేరుతో కొంతమంది యువకులు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భగ్నం చేశారు. ఈ పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై (Mumbai) నుంచి యువతులను రప్పించినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకులు అందరూ పాత బస్తీకి చెందిన వారు కాగా యువతుల్లో ముంబై నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం.
………………………………………..