
* సైదాబాద్ ఘటన మరవక ముందే మరో ఘటన
* హైదరాబాద్ బండ్ల గూడలో దారుణం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : సైదాబాద్ జువైనల్ హోంలో ఆరుగురు బాలురపై పర్యవేక్షకుడు లైంగిక దాడి చేసిన ఘటన మరువక ముందే హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తి చూపించి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………………..