* ఆయా, స్కూల్ యజమాని అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నర్సరీ చదువుతున్న చిన్నారి పట్ల ఓ పాఠశాల ఆయా అమానుషంగా ప్రవర్తించిన ఘటన సంచలనంగా మారింది. పసిపాప అని కూడా చూడకుండా చెంపలపై కొడుతూ, కింద పడేస్తూ పాపపై విచక్షణారహితంగా దాడి చేసింది. బాలిక జుట్టు పట్టుకుని తలను పలుమార్లు సిమెంటు నేలకేసి బాదింది. ఈ అమానుష ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆ స్కూల్‌ను సీజ్ చేశారు. దారుణానికి పాల్పడిన ఆయాతో పాటు స్కూల్ యజమానిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు షాపూర్ నగర్‌లోని పూర్ణిమ పాఠశాలను మండల విధ్యాశాఖ అధికారి జెమిని కుమారి పాఠశాలను తనిఖీ చేశారు. జరిగిన సంఘటనపై పూర్తి విచారణ చేపట్టారు. పాఠశాలకు అధికారులు విచారణకు వస్తున్నారని తెలుసుకున్న యాజమాన్యం ముందుగానే సెలవు ప్రకటించింది. దీనిపై ఎంఈఓ సీరియస్ అయ్యారు. పిల్లలకు సెలవు ఇస్తే టీచర్లు, ఆయాలు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఈపాఠశాలకు అనుమతులు ఉన్నా, ఇక్క పిల్లలకు తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేరని గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
………………………………………….
