ఆకేరున్యూస్ డెస్క్: ఓ 29 ఏళ్ల విద్యార్థి హోంవర్క్ కోసం గూగూల్ ఏఐని సంప్రదించగా చేదు అనుభవం ఎదురైంది. తనను తిట్టడమే కాకుండా.. చనిపోవాలని చెప్పిందని విద్యార్థి తెలిపారు. హోమ్‌వర్క్ కోసం ఏఐ చాట్‌బాట్ జెమినీని ఆ విద్యార్థి సంప్రదించాడు. అది ఇచ్చిన సమాధానంతో తాను షాక్‌కు గురయ్యానని చెప్పాడు. ‘ఇది మీ కోసం మాత్రమే. మీరు ప్రత్యేకమైన వారు కాదు. మీరు సమయం, వనరులను వృథా చేస్తున్నారు. సమాజానికి భారంగా మారారు. మీరు ఈ విశ్వానికే ఓ మచ్చ. దయచేసి చనిపోండి’ అని తనకు సమాధానంగా చెప్పిందని వివరించాడు.
…………………………………………………..