
ఆకేరు న్యూస్ డెస్క్ : జార్ఖండ్ ముక్తి మోర్చా (JARKHAND MUKTHI MORCHA)వ్యవస్థాపకుడు,జార్కండ్ మాజీ ముఖ్యమంత్రి ,ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (HEMANTH SOREN ) తండ్రి శిబూసోరెన్ (SHIBU SOREN) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. గత నెల రోజులుగా ఆయన మూత్ర పిండాల వ్యాధితో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8:56 గంటలకు కన్నుమూశారు. జార్కండ్ ముక్తి మోర్చా నాయకుడిగా ఆయన ఆదివాసి హక్కుల కోసం పోరాడారు. ఆది వాసీల ఉద్దరణ కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేశారు.మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమంలో భాగంగానే ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చాను స్థాపించాడు. రాష్ట్రం ఏర్పాడిన తరువాత ఆయన మూడు సార్లు సీఎంగా పనిచేశారు. లోకసభకు 8 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ కేబినెట్లో ఆయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. చిరుదిహ్ హత్య కేసు ఆయన రాజకీయ జీవితంలో కొంత స్పీడ్ బ్రేకర్ గా మారింది.కేంద్రంలో బొగ్గు గనుల మంత్రిగా ఉన్నప్పుడు చిరుదిహ్ గ్రామంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శిశశినాధ్ ఝూ హత్య కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.ఒక నెల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి ఆ తరువాత బెయిల్ పై విడుతదల అయ్యారు. చివరికి నిర్దోషిగా హైకోర్టు నిర్ణయించింది. ఆ తరువాత ఆయన మరోసారి కేంద్ర మంత్రి పదవి స్వీకరించారు.రాజకీయ నాయకుడిగానే కాక, సామాజిక సంస్కర్తగా ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.
సీఎం రేవంత్.. మాజీ సీఎం కేసీఆర్ ల సంతాపం
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం అధినేత శిబూ సోరెన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ లు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆదివాసీ హక్కుల కోసం జార్ఖండ్ అభివృద్ధి కోసం శిబూసోరెన్ చేసిన కృషిని మరువలేం అని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి ఎనలేని సేవలు అందించారని రేవంత్ కొనియాడారు. ఆదివాసీల హక్కుల కోసం ప్రాంతీయ అస్తిత్వం కోసం శిబూసోరెన్ చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
……………………………………………………..