* బీర్ల సరఫరా నిలిపేసిన కింగ్ ఫిషర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని మద్యం ప్రియులకు ప్రధానంగా బీర్ల ప్రియులకు మింగుడు పడని వార్త ఇది. ప్రముఖ బీర్ల కంపెనీ కింగ్ఫిషర్ (KING FISHER)రాష్ట్రానికి బీర్ల సరఫరాను నిలిపివేసింది. టీజీ బీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతో బీర్ల సరఫరా నిలిపివేసినట్లు యునైటెడ్ బ్రూవరీస్(UNITED BRAVERIES) ప్రకటించింది. ఈ విషయాన్ని సెబీకి లేఖ ద్వారా తెలిపింది. 2019 నుంచి ధరలను సవరించకపోవడంతో భారీ నష్టాలు వస్తున్నాయని ఆ లేఖలో పేర్కొంది. ధరల సవరణ అనంతరం బీర్ల సరఫరాపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
…………………………………….