
* హైకోర్టు షోకాజ్ నోటీసులు..
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వివాదాస్పద భూమి కొనుగోలు విషయంలో రaాన్సీ రెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2017లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో ఝాన్సీ రెడ్డి దంపతులు 75 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం ఈ స్థలంలో శంకుస్థాపన చేయడంతో భూమి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ స్థలాన్ని విదేశీయురాలైన ఝాన్సీరెడ్డి ఎలా కొనుగోలు చేశారని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత పౌరసత్వాన్ని వదిలి అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించిన రaాన్సీరెడ్డి, విదేశీ మారక వ్యవహారాల చట్టం ప్రకారం వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం నేరం. అదేవిధంగా తప్పుడు డాక్యుమెంట్స్ చూపించి భూమిని కొనుగోలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు పాస్ బుక్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఈ పిటిషన్పై మే 1న హైకోర్టులో జడ్డి సీవీ భాస్కరెడ్డి ఆధ్వర్యంలో ధర్మాసనం విచారణ చేపట్టగా.. ఫెమా నిబంధనలు ఝాన్సీ రెడ్డి ఉల్లంఘించారని.. భూమి కొనుగోలుపై జూన్ 19 లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డి దంపతులతో పాటు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్లకు సైతం న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
……………………………………