
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ బీఆర్ ఎస్ నేతలు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తన్నీరు హరీశ్‌రావులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. శుక్రవారం కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే.. దానిని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
……………………………………