
* ఉధృతమవుతున్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఉధృతమవుతోంది. మార్వాడీ వ్యాపారాలతో స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని ఓయూ జేఏసీ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. మార్వాడీలు స్థానికుల ఉపాధి అవకాశాలను కొల్లగొడుతుతూ, స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్న పృథ్విరాజ్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. సామాజిక మాధ్యమంలో మొదలైన ఈ నినాదం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోకి చేరింది. దీంతో శుక్రవారం పలు జిల్లాల్లో దుకాణాలు, విద్యా సంస్థలు బంద్కు మద్దతు తెలిపాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పలు చోట్ల పోలీసులు మోహరించారు. కాగా, మార్వాడీలకు బీజేపీ నాయకులు బండి సంజయ్, రాంచందర్ రావు, రాజాసింగ్ మద్దతుగా నిలిచారు.
……………………………………………..