
* బస్ టికెట్ కన్నా తక్కువ ధరకే విమానంలో వెళ్లండి!
* ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్స్
ఆకేరు న్యూస్, డెస్క్ : పండగలకు ప్రధానంగా ఏపీవాసులు సంక్రాంతికి ఊరెళ్లాలంటే ప్రయాణం కష్టాలు అన్నీఇన్నీ కావు. రైలులో టికెట్లు దొరకడం గగనమే. ఇక ఆయా రోజుల్లోబస్సుల ధరలు చూస్తే ఒక్కో సాధారణం 3000 నుంచి 5000 పైనే ఉంటాయి. అంత ధరలు ఎందుకు? అంతకన్నా తక్కువ ధరకే విమానంలో ప్రయాణించవచ్చు. ఎలా అంటారా? ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) అందుకు అవకాశం కల్పిస్తోంది. వారం రోజుల పాటు ‘గ్రాండ్ రన్అవే ఫెస్ట్’ సేల్‌ను ప్రకటించింది. నిన్నటి నుంచి కంపెనీ సేల్ ప్రారంభించింది. 21 వరకు కొనసాగనుంది. ఈ సేల్ 2026 ప్రారంభంలో కస్టమర్లు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లు జనవరి 7 నుంచి మార్చి 31, 2026 వరకు ప్రయాణానికి చెల్లుతాయి. దేశీయ విమాన టిక్కెట్ ధరలు రూ.1,299 నుండి ప్రారంభమవుతాయని సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయ చార్జీలు రూ.4,599 నుండి ప్రారంభం అవుతాయి. ఈ ఆఫర్ ఇండిగో వన్-వే (One-Way) బుకింగ్‌లకు మాత్రమే చెల్లుతుంది. రౌండ్-ట్రిప్ బుకింగ్‌లకు వర్తించదు. అలాగే, ఈ ఆఫర్ ఇండిగో నిర్వహించే నాన్-స్టాప్ విమానాలకు మాత్రమే చెల్లుతుంది.
……………………………………..