* పారిపోతున్న ఎస్సైను వ్యవసాయ పొలాల వద్ద పట్టుకున్న అధికారులు
* టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్న స్థానికులు
ఆకేరు న్యూస్, మెదక్ : మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడి చేసి, రూ.30 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ రాజేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టకున్నారు. ఏసీబీ అధికారుల నుండి తప్పించుకుని పారిపోతున్న రాజేష్‌ను, చేజ్ చేసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద పట్టకున్నారు. ఎస్ఐ రాజేష్ ఏసీబీ అధికారులకు చిక్కడంతో గ్రామ ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
…………………………………………
