* సైలెన్సర్లు .. హారన్లు మార్చి ఇబ్బంది పెడుతున్న కొంటె కుర్రాళ్లు
* విపరీత శబ్దాలు చేస్తున్న వాహనాలు
* మితిమీరుతున్న బైక్ వీరుల ఆగడాలు
* యువత కోరిక మేరకు సైలెన్సర్లను మార్చుతున్న మెకానిక్ లు
* ఇలాంటివి మానుకోవాలని ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి
ఆకేరు న్యూస్ హనుమకొండ : నగరంలో బైక్ వీరుల ఆగడాలు రోజురోజుకూ ఎక్కవవుతున్నాయి..కొంత మంది కొంటె కుర్రాళ్లు బైక్ లపై విపరీతమైన శబ్దాలు చేస్తూ ఆనందం పొందుతున్నారు. బైక్ సైలెన్సర్లను కావాలనే మార్చి విపరీత శబ్బం వచ్చేలా సైలెన్సర్లను, హారన్లను పెట్టుకుంటున్నారు. మెకానిక్ ల సహాయంతో సైలెన్సర్లను, హారన్లను మార్చుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా రోడ్లపై, చిన్ని చిన్న గల్లీల్లో విపరీతమైన శబ్దాలు చేస్తూ పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారు.చట్టం 190 (2)1988 ప్రకారం ఇలాంటివి నిషేదం. అయినా పట్టించుకోకుండా కొంతమంది యువకులు రోడ్లపై చేస్తున్న ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అర్ధరాత్రి వేళ విపరీతమైన శబ్దాలు చేస్తూ రోడ్లపై తిరుగుతుంటే చిన్నపిల్లలు,వృద్ధులు, జబ్జు చేసి ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగర వాసులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి తక్షణమే ఆపి వేయాలని ట్రాఫిక్ పోలీసులు నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
………………………………………………….
