
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన చేరాల సిరి సహస్ర నేడు వెలువడిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇంటర్మీడియట్ 2025 పరీక్షల్లో ఆల్ ఇండియా 35 వ ర్యాంకు సాధించింది. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన చేరాల రాజ్ కుమార్ – సరస్వతి దంపతుల కుమార్తె చేరాల సిరి సహస్ర CA ఆల్ ఇండియా స్థాయిలో 35వ ర్యాంకు సాధించటంతో కుటుంబ సభ్యులు ,బంధువులు, స్నేహితులు సిరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సిరి సహస్ర మొదటినుంచి చదువుల్లో చురుకుగా ఉండేదని, ఇంటర్మీడియట్ ఫలితాలలోను స్టేట్ ర్యాంకు సాధించిందనీ ఆమె తల్లిదండ్రులు తెలిపారు.
………………………………………