
* వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణకు బిల్లు
* అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ఆకేరున్యూస్, హైదరాబాద్: బెట్టింగ్ యాప్, ఆన్లైన్ గేమ్‌ల నిషేధానికి సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల యాప్స్ వల్ల జరుగుతున్న అనర్థాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తాము అధికా ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అందుకే తమ ఏడాదికి పైగా పాలనలో ఎలాంటి ఘటనలు లేవని చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వీటిని నిరోధించడానికి స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్, ఆన్లైన్ గేమ్‌ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని.. మన పరిధిలో విచారణ జరిపిస్తే సమస్యకు సరైన పరిష్కారం దొరకదన్నారు. ఈ కేసులో శిక్షపడేలా ప్రత్యేక చట్టం చేస్తామన్నారు. గుట్కా నిషేదం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్లను విచారిస్తే సరిపోదు.. బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు ఉండాలన్నారు. వచ్చే సమావేశాల్లో ఆన్లైైన్ బెట్టింగులపై చట్ట సవరణ చేస్తామన్నారు. దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్నామని.. ప్రకటనలు చేసినా.. నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న.. కఠినంగా వ్యవహారం ఉంటుందని సిఎం రేవంత్ ప్రకటించారు.
……………………………..