* గవర్నర్ కు సీతక్క ఆహ్వానం
ఆకేరు న్యూస్,ములుగు: ఈనెల 28వ తారీఖు నుండి 31వ తేదీ వరకు జరుగు మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర అటవీశాఖ ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, గిరిజన పూజారులు సోమవారం లోక్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ కు ఆహ్వాన పత్రము అందించారు. ప్రస్తుతము జాతరలో జరుగుతున్న అభివృద్ధి వివరిస్తూ గిరిజన ఆదివాసి ఆరాధ్య దైవాల చరిత్ర 200 సంవత్సరాలు నిలిచి ఉండే విధంగా మాస్టర్ ప్లాన్ తో అభివృద్ధి పనులు ర్వహిస్తున్నట్లు గవర్నర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో మేడారం జాతర కార్యనిర్వాహణ అధికారి వీరస్వామి పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధ బోయిన జగ్గారావు తో పాటు సారలమ్మ పూజారులు కాక సారయ్య, కాక వెంకన్న దేవాదాయ శాఖ అధికారులు తదితరులున్నారు.

