
* కాళేశ్వరంపై జుడిషియల్ విచారణ అనంతరం చర్యలు
* మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను గుర్తించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Utham kumar reddy) తెలిపారు. ఎస్ ఎల్బీసీ పనులను పూర్తి చేసేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు కూడా కట్టుబడి ఉన్నామన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు పనులను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. కాళేశ్వరం డిటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ కు , నిర్మాణానికి తేడా ఉందని వివరించారు. ఈ విషయంలో ఎన్డీఎస్ఏ రిపోర్టు కోసం చూస్తున్నామన్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి పాటిల్‌ను కలిసి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇవ్వాలని కోరామన్నారు. కాళేశ్వరం(Kaleswaram)పై జుడిషియల్ విచారణ జరుగుతోందన్నారు. నివేదికల మేరకు చర్యలు ఉంటాయని వెల్లడించారు. కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్టు వచ్చిందన్నారు.
………………………………………….