Sneha Group IT Raids second day
* రూ.5 కోట్ల నగదు స్వాధీనం..
* 17 ప్రాంతాల్లో తనిఖీలు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్నేహ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారుల తనిఖీలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
* హైదరాబాద్‌లో ఐటీ అధికారుల మెరుపు దాడులు..
కొండాపూర్‌లోని స్నేహ ఫార్మ్స్ ప్రధాన కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. స్నేహ గ్రూప్‌కు సంబంధించిన కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈ తనిఖీల్లో ఇప్పటివరకు రూ.5 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గ్రూప్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇతర రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
రెండో రోజు కూడా సోదాలు కొనసాగుతుండటంతో ఈ వ్యవహారం హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. ఐటీ అధికారుల తనిఖీలు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read : నిజమైన ఫ్యూచర్ సిటీ వరంగల్!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

