
ఆకేరు న్యూస్, కమలాపూర్: ఉపాధి హామీ పథకం 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమంను శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు మండలంలోనీి రైతు వేదికలో నిర్వహించారు. మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు రూ.8కోట్ల8 లక్షలతో జరిగిన వివిధ పనులపై బృందాలు ఈ నెల 11నుంచి17 వరకు తనిఖీలు నిర్వహించారు.డీఆర్డిఓ మేన శ్రీను అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో తనిఖీ చేసిన సోషల్ ఆడిట్ పని నివేదికలను గ్రామాలు, అంశాల వారిగా డీఆర్డిఓ చదివి వినిపించారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు కొలతలు, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని క్షేత్రస్థాయి అధికారులను, రికార్డుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ కార్యదర్శులను డీఆర్డిఓ ఆదేశించారు.ప్రతి పనికి సంబంధించిన వివరాలు గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డ్ లో పెట్టాలన్నారు. నర్సరీల్లో 85% కంటే ఎక్కువ మొక్కలు బ్రతికి ఉండాలని డిఆర్డిఓ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుండె బాబు,అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్ రెడ్డి, డీవో నర్సిమారెడ్డి,ఎస్క్యూసిఓ పుష్పలత,డిటిసి శ్రీధర్,సిసి పున్నం చందర్,ఎస్ఆర్పి రంజీత్, సీనియర్ డిఆర్పి కళ్యాణ్, శంకర్, ఈజీఎస్ సిబ్బంది,సహచరులు,కార్మికులు పాల్గొన్నారు.
………………………………..