
* రైసింగ్ తెలంగాణ 2047 లక్ష్యంతో ముందుకు
* ప్రపంచ దేశాలతోనే మన పోటీ
*నెహ్రూ మందు చూపు వల్లే ఇంత అభివృద్ధి
* నీటి వాటాల్లో రాజీ పడే ప్రసక్తే లేదు
* అనుకున్నది సాధించడమే నా నైజం
* స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్
* గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం
ఆకేరున్యూస్,డెస్క్ సామాజిక న్యాయం కాంగ్రెస్ డీఎన్ ఏలోనే ఉంది, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 79 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ( CM REVANTH REDDY)గోల్కొండ కోట ( GOLCONDA FORT) పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న సంక్షేమ ఫలాలు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా అందుతున్నాయన్నారు.1947 ఆగస్టున ఆనాడు ఎర్రకోటపై నుండి దేశప్రజలనుద్దేశించి మాట్లాడిన నెహ్రూ ( PANDIT JAWAHARLAL NEHRU) మాటలను ఈనాడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో అసమానతలు రూపు మాపిసమసమాజ స్థాపన కోసం నెహ్రూ వేసిన ప్రణాళికల వల్లే నేడు దేశం ఇంత గొప్ప స్థానంలో ఉందని అన్నారు. దేశాభివద్ధి కోసం పంచవర్ష ప్రణాళికలు రూపొందించి తద్వారా దేశాన్ని అభివృద్ధి వైపు నెహ్రూ నడిపించారని రేవంత్ అన్నారు. నెహ్రూ సారధ్యలో ఆనాడు శూన్యంతో మొదలైన మన ప్రయాణం 70 ఏళ్ల కఠోర శ్రమ ఎందరో మహనీయుల కృషి వల్ల ఈ నాడు ఈ స్థాయిలో ఉండగలిగాం అని రేవంత్ అన్నారు.
నెహ్రూ వేసిన పునాది వల్లే నేడు భారత దేవం ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదగబోతోందని రేవంత్ గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాం
2023 డిసెంబర్ 9న తెలంగాణలో పదేళ్ల తరువాత మళ్లీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పారదర్శకతతో పరిపాలన చేస్తూ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం అడుగులు వేస్తున్నామని రేవంత్ అన్నారు. కులగణన చేపట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టి దేశానికి దారి చూపాం అని అన్నారు. మొత్త దేశానికే రోల్ మోడల్ గా నిలిచామన్నారు.
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ అని రేవంత్ అన్నారు. పేదల ఆకాంక్షలను నెరవేరుస్తూ సంక్షేమరంగంలో సరికొత్త చరిత్ర సృష్టించామన్నారు. 1957లో నే ప్రజాపంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీది అని రేవంత్ అన్నారు.గత పదేళ్ల కాలంలో అమలుకు నోచుకోని రేషన్ కార్డుల పంపిణీని మళ్లీ ప్రారంభించామని రేవంత్ అన్నారు. ఉగాది నుంచి 3 కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని రేవంత్ అన్నారు. గత పదేళ్లలో మూత పడ్డ రేషన్ షాపుల మందు ఈ రోజు సందడి కన్పిస్తోందని రేవంత్ అన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా…
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో 25 లక్షల 35 వేల మంది రైతులను రుణ విముక్తి చేశామన్నారు. సకాలంలో రైతులకు రైతు భరోసా చెల్లించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అని రేవంత్ అన్నారు. 70 లక్షల 11 వేల మంది రైతులకు 1 లక్షా 20వేల కోట్ల రైతు భరసా చెల్లించామన్నారు. రైతుల పండించిన ధాన్యానకి కొనుగోలు కేంద్రాల ద్వారా 48 గంటల్లోనే వారికి నగదు ఖాతాలో జమ అయ్యేలా చేశామన్నారు. 29 లక్షల పంపుసెట్లకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తున్నాం అన్నారు. 16 వేల 691 కోట్ల రూపాయలు విద్యుత్ వాఖకు చెల్లింస్తున్నాం
సొంతింటి కల నెరవేర్చాం..
గత పదేళ్లుగా ఎదురు చూస్తున్న పేదలకు సొంతింటి కలను నెరవేర్చాం అని రేవంత్ రెడ్డి అన్నారు.
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామన్నారు.4 లక్షల 50 వేల ఇండ్లను రాజకీయాలకతీతంగా పేదలకు ఇచ్చాం అన్నారు.
ఆరోగ్యశ్రీని విస్తృత పరిచాం..
పేదలకోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీని మరింత విస్తృత పరిచాం అని రేవంత్ అన్నారు. 5 లక్షల పరిమితి ఉన్న ఆరోగ్య శ్రీని 10 లక్షల వరకు పెంచాం అని రేవంత్ అన్నారు. పేదలకు సేవలందించే ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ వద్ద పునర్మిస్తున్నామని రేవంత్ అన్నారు. 25 ఎకరాల్లో 2 వేల 700 కోట్లతో ఉస్మానియా ఆస్పత్రిని ఆధునిక సదుపాయాలతో నిర్మించనున్నట్లు రేవంత్ తెలిపారు.
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం..
తెలంగాణ లోని కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులనే చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసాన్ని పొందించామన్నారు, ఉచిత ప్రయాణాల ద్వారా ఆర్టీసి లాభాల్లో పడిందన్నారు. 20 నెలల్లో ఆర్టీసీకి 6 వేల 7వందల 90 కోట్లు చెల్లించామన్నారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ…
తెలంగాణ ను డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. డ్రగ్స్ వాడాలంటేనే వణుకుపుట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ గంజాయి నియంత్రణకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు.
ఉద్యోగాల కల్పన…
20 నెలల్లో 60వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో డీఎస్సీ ద్వారా 10 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రేవంత్ వివరించారు. పబ్లిక్ సర్వీస్ పరీక్షల ద్వారా త్వరలో గ్రూప్ 1,2,3 ఉద్యోగాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు తెలంగాణలో స్కిల్ యూనివర్సిటి,స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశామన్నారు
నీటి వాటాల్లో రాజీ పడే ప్రసక్తే లేదు…
కృష్ణ, గోదావరి నీటి వాటాల్లో రాజీ పడే ప్రసక్తే లేదని రేవంత్ అన్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా వారి ఎత్తులను తిప్పి కొడతాం అన్నారు. పండిట్ నెహ్రూ కాలంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల వల్లే తెలంగాణ నేడు వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచిందని రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం లక్ష కోట్లు పెట్టి నిర్మంచిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని రేవంత్ విమర్శించారు. మిగిలి ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్త చేస్తాం అన్నారు.
ప్రపంచ వేదికగా హైదరాబాద్ ..
రానున్న రోజుల్లో హైదరాబాద్ ను ప్రపంచానికే వేదికగా మార్చ డోతున్నాం అని రేవంత్ అన్నారు. అందుకు ఉదాహరణ హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడమే అన్నారు, ఈ పోటీల ద్వారా హైదరాబాద్ గొప్పతనం ప్రపంచదేశాలకు తెలిసిందన్నారు. ప్రపంచ పెట్టుబడులు హైదరాబాద్ రావడానికి హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చితిద్దుదామన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ ఫార్మా హబ్ గా మారుతుందన్నారు.
రైజింగ్ తెలంగాణ 2047…
రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని రేవంత్ అన్నారు. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం అన్నారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకానమీ సాధించి దేశ ఎకానమీలో 10 శాతం ఉండేలా ప్రణాళికలు సిధం చేస్తున్నామని రేవంత్ అన్నారు
హైడ్రాతో …
గత ప్రభుత్వ హయాంలో కబ్జాకు గురైన చెరువులను నాలాలను పునరుద్దరించామన్నారు. హైడ్రాపై కొంత మంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ అన్నారు.హైడ్రాతో కబ్జాకు గురైన 13 పార్కలను 20 సరస్సులను 30వేల కోట్ల విలువైన ఆస్తులను కాపాడామని రేవంత్ అన్నారు.
పారిశ్రామిక కారిడార్లు…
హైదరాబాద్ నుంచి అమరవాతి, నాగపూర్ ల మధ్య పారిశ్రామిక కారిడార్ లు ఏర్పాటు చేస్తామన్నారు హైదరాబాద్ బెంగళూరుల మధ్య డిఫెన్స్ కారిడార్ ను ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుతూ ఎంత ఆర్థిక భారం ఉన్నా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అందరిసహకారంతో తెలంగాణను 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మలిచేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
………………………………………………..