
కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి
* కొండా సురేఖ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి రియాక్షన్
ఆకేరు న్యూస్ డెస్క్ : మంత్రి కొండా సురేఖ (KONDA SUREKHA)చేసిన వ్యాఖ్యలపై సోనియా గాంధి క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (KISHAN REDDY)డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ ( JANTHAR MANTHAR)వద్ద కాంగ్రెస్ చేపట్టి న దీక్షలో మంత్రి కొండా సురేఖ ప్రధాని మోదీ,రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు సంబందం లేని రాష్ట్రపతిని విమర్శిస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు సోనియా గాంధి బాధ్యత వహించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని అన్నారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఏడాదిన్నర పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదని కిషన్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబాన్ని పొగడడానికే ఢిల్లీలో ధర్నా చేశారని అన్నారు..రాష్ట్రపతిపై వ్యాఖ్యానించడం మహిళలను అవమానపరడమే అన్నారు. బీసీ రిజర్వషన్ల ముసుగు రాజకీయాలు చేయడం సరికాదన్నరు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు
…………………………………..