ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. కోటి రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అలాగే ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు. సౌమ్య విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని వాపోయారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎక్సైజ్ విధి నిర్వహణలో ఉన్న అధికారులకు ఆయుధాలు సమకూర్చుతామన్నారు.

……………………………………………………………………………..
