
* ములుగు జిల్లా విద్య శాఖ అధికారి( ఇంచార్జి) దురిశెట్టి చంద్రకళ
ఆకేరు న్యూస్, ములుగు:విద్యా బోధనలో ప్రత్యేక శ్రద్ధ వహించి స్థాయికి తగిన విద్యను విద్యార్థులకు అందించాలని ములుగు జిల్లా విద్య శాఖ అధికారి( ఇంచార్జీ) దురిశెట్టి చంద్రకళ సూచించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ని జిల్లా పరిషత్ పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశా లలను ఆమె శనివారం ఆకస్మికంగా సందర్శించి తనకి నిర్వహించారు మొదట పాఠశాలల్లోని వసతులు సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు పాఠశాలల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి చిన్న చిన్న అంకెలు, ఏ బి సి డి లు, రైమ్స్ తదితర విషయాలను పిల్లలను ప్రశ్నిస్తూ జవాబు రాబట్టారు. విద్యార్థులు స్పష్టంగా సమాధానాలు చెప్పడంతో సంతృప్తి ప్రయత్నం చేశారు . ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రస్తుత సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ నోడల్ ఆఫీసర్ సోమారెడ్డి, ఉపాధ్యాయులు అన్నా మేరీ, రఘురామ్, రేణుక ,హరిత ,ప్రవళిక, అశ్విని ,రమేష్ ,విష్ణు తదితరులున్నారు.
………………………………………