* టీజీఎస్సార్టీసీ నిర్ణయం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తెలంగాణలో పెద్ద ఎత్తున జరుపుకునే సద్దుల బతుకమ్మ, దసరా పండగల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పండగ వేళ ప్రజలు తాము ఉంటున్న ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు పయనమవుతారు. పండగ సీజన్ లో ఉండే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 30న బతుకమ్మ, అక్టోబర్ 2న దసరా పండగలు ఉన్న నేపథ్యంలో ఈ నెల 27 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు. అదనంగా 7754 బస్సులను 377 స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నారు.స్పెషల్ సర్వీసుల్లో ప్రయాణించడానికి ముందుగానే రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.హైదరాబాద్లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల రవాణా ఉంటుంది.రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి
వెబ్సైట్, కాల్ సెంటర్ నెంబర్లు ఇవే..
బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtcbus.inలో చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
……………………………………………
