* టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
ఆకేరున్యూస్, అమరావతి: వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా పదిరోజుల పాటు తిరుమలలో ప్రత్యేక దర్శనాలు , సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఈనెల 10 నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముండడంతో ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్టు బుధవారం వెల్లడిరచారు. వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు. ఈనెల 10న ఉదయం 4.30 గంటలకు ప్రొటోకాల్ దర్శనాలు, 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు ఉంటుందన్నారు.
………………………………….