
* నల్లమల డిక్లరేషన్ ఆవిష్కరణ
* గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు
* రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపుసెట్లు
* ‘ఇందిర సౌర గిరిజల వికాసం’ పథకం ప్రారంభం
* నల్లమలను ఆదర్శంగా నిలుపుతాం
* సీఎం రేవంత్‌రెడ్డి
ఆకేరున్యూస్, నాగర్‌కర్నూల్ : నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తున్నామని చెప్పారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ’ఇందిర సౌర గిరిజల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ’నల్లమల డిక్లరేషన్’ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని తెలిపారు. అనంతరం నల్లమల ప్రాంతం గురించి సీఎం ప్రసంగించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారని నాటి రోజులను సీఎం గుర్తు చేశారు. సీఎంగా ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగిపోతోందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక్కడి రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఇస్తామని సీఎం హావిూ ఇచ్చారు. వందరోజుల్లో సోలార్ విద్యుత్ మోటార్ అందిస్తామని శుభవార్త చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని ప్రపంచానికే ఆదర్శంగా మారుస్తామని అన్నారు. దిగ్గజ కంపెనీలతో పోటీపడేలా శిల్పారామం దగ్గర మహిళలకు స్టాళ్లు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి భోజనం చేసి వచ్చానని గుర్తు చేశారు. నేడు ప్రతి పేదవాడి ఇంటికీ సన్న బియ్యం అందుతోందని తెలిపారు. ఇప్పటి వరకు రైతుల కోసం రూ.60వేల కోట్లు- ఖర్చు చేశామని సీఎం వెల్లడిరచారు. గతంలో వరి వేస్తే ఉరే అని ఆనాడు అన్నారు.. ఆ దొర మాత్రం వందల ఎకరాల్లో వరి వేసుకున్నారు.. విూరు వరి పండిస్తే బోనస్ ఇస్తామని మేము చెప్తున్నాం.. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నాం.. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఎవరూ తినేవారు కాదు.. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకున్నాం. నిత్యావసరాల ధరలు తగ్గించడంలో మనమే నంబర్ వన్ అని కేంద్రం చెప్పింది.. శాంతి భద్రతల్లో కూడా మనమే నంబర్ వన్‌లోనే ఉన్నాం.. రాష్ట్ర ఆదాయంలో కూడా తెలంగాణ నంబర్ వన్ అని కేంద్రమే చెప్పింది.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కోసం రూ.60 వేల కోట్లు- ఖర్చు చేశాం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారు. సీఎంగా ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగిపోతోంది. పాలమూరు, నల్లమల ప్రాంత వాసినని గర్వంగా చెప్పుకొంటా. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటున్నా. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు వాసులను పిలిచేవారు. ఇక్కడి ప్రజలు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నెముకగా నిలిచాయి. ఇక్కడి రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఇస్తాం. వందరోజుల్లో సోలార్ విద్యుత్ మోటార్ అందిస్తాం. అచ్చంపేట నియోజకవర్గాన్ని ప్రపంచానికే ఆదర్శంగా మారుస్తాం అన్నారు. పహల్గాం ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ వచ్చింది. ఆమె గతంలో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేశారు. 50 ఏళ్ల తర్వాత ఇందిరాగాంధీ పేరు చెప్పుకొంటున్నాం. దేశానికి స్వేచ్ఛనిచ్చిందే కాంగ్రెస్. అందరికీ భూములు ఇచ్చి ఆత్మగౌరవం నింపాలన్నది మా పార్టీ నినాదం. ప్రతి ఆదివాసీ గుండెల్లో ఇందిరమ్మ ఉంటుందని రేవంత్ అన్నారు. అనంతరం సతీమణితో సహా సీఎం రేవంత్‌రెడ్డి కొండారెడ్డిపల్లె శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ సీఎం దంపతులు, మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సభాపతి గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా, సీతక్క తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..