
* ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
ఆకేరు న్యూస్ మానకొండూర్ : రైతులకు వ్యవసాయంతోపాటు అదనపు ఆదాయం సమకూర్చే పాడిపరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు ఆదాయ మార్గమైన పాడిపరిశ్రమను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వ్యవయానికి ప్రాధాన్యం ఇచ్చినట్టుగానే పాడిపరిశ్రమకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. పాడిపరిశ్రమ అభివృద్ధి చెందాలంటే పశువులు ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. అందుకే పశువులకు మంచి మేతతోపాటు దాణా అందించాలన్నారు.ముఖ్యంగా అనారోగ్యాల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు సోకినప్పుడు వెంటనే పశువైద్య కేంద్రాలకు తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయించాలన్నారు. పాలిచ్చే గేదెలకు, ఆవులకు గాలికుంటు వ్యాధి సోకినట్లయితే తక్కువ మోదులో పాలిస్తాయన్నారు. వ్యాధుల బారినపడిన పశువులకు చికత్స చేయించే విషయంలో చాలా మంది రైతులకు సరైన అవగాహన లేదని, అందుకే కొంత మంది రైతులు పశువులకు మందులు వేయించడానికి ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గాలికుంటు వ్యాధి నివారణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, అందులో భాగంగానే విడతల వారీగా గాలికుంటు వ్యాధి నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ వారోత్సవాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకుడు. పశువైద్యాధికారులు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, పార్టీ నాయకులు కొత్త తిరుపతిరెడ్డి, గోగూరి నర్సింహారెడ్డి, బుధారపు శ్రీనివాస్, చిరంజీవి,వరాల అనిల్, ఎస్.కొండల్ రావు, చింతల లక్ష్మారెడ్డి, టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………