Government Welfare Schemes
ఆకేరు న్యూస్, రాయపర్తి: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
మండలంలోని బురహాన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ సర్పంచ్ సూదుల ఉమాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామ సభకు ముఖ్య అతిథులుగా మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి ( ఎం పి డీ ఓ ఎఫ్ ఏ సీ)కూచన ప్రకాష్ లు పాల్గొన్నారు .
గ్రామాభివృద్ధి, ప్రజా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏడు ముఖ్యమైన ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గ్రామాల స్వయంసమృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసమే ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు ఆయన తెలిపారు.
అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కూచన ప్రకాశ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘ఘన వ్యర్థాల నిర్వహణ నియామకాలు – 2026’ నిబంధనలను తుచా తప్పకుండ గ్రామంలో అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి ఇల్లూ తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలని, ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామ సభలో 7 ముఖ్యమైన అంశాలపై చర్చించినట్లు తెలిపారు .
వర్షాకాల సన్నద్ధత వర్షాకాలంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామములో మురుగు కాలువల శుభ్రత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నివారణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
సురక్షిత తాగు నీరు గ్రామంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు నిరంతరం అందేలా చర్యలు తీసుకోని క్రమం తప్పకుండా వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఘన వ్యర్థాల నిర్వహణ 2026 నిబంధనల ప్రకారం చెత్త సేకరణ, వైజ్ఞానిక పద్ధతుల్లో దాని నిర్వహణపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.జల సంరక్షణ – మన సంరక్షణ భూగర్భ జలాల పెంపుకై ఇంకుడు గుంతల నిర్మాణం, చెరువుల రక్షణ, వర్షపు నీటిని వృధా చేయకుండా నిల్వ చేసుకునే పద్ధతులపై తీర్మానం చేశారు.
మొక్కల పెంపకం – వన మహోత్సవం వర్షాకాలంలో గ్రామ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను యువత, మహిళలు తీసుకోవాలని సూచించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, తప్పుల సవరణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ (SIR) అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.వరద నిర్వహణ భద్రత భారీగా వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం, అత్యవసర సమయాల్లో భద్రతా చర్యలు చేపట్టడంపై ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమములో గ్రామ ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
