
ఆకేరు న్యూస్ తాడ్వాయి ః తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు పూర్వ ఉపాధ్యాయులను విద్యార్థులు పూలమాల లతో సత్కరించి శాలువాలతో సన్మానించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ఆనాటి స్మృతులు జ్ఞాపకాలను నెమరు వేశారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. స్థానిక ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేవతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్వ ఉపాధ్యాయులు ఎస్ వి ఎస్ టి బట్టాచార్యా, ప్రకాశం, వాసు దేవరెడ్డి, దయాసాగర్, లింగయ్య, సారంగపాణి, చంద నారాయణ, ఈసం బుచ్చయ్య, రఘు శర్మ, జ్యోతిర్మయి, రామచందర్, విద్యార్థులు కొమరం ప్రభాకర్, గౌర బోయిన బిక్షపతి, సాదు చక్రపాణి, ఆలేటి ఇంద్రారెడ్డి, జయపాల్ రెడ్డి, జగ్గారావు, మొగిలిపల్లి రవీందర్, ఇరుప సూర్యనారాయణ ,పాయం కవిత, జవ్వాజి నీలం బాబు, తోలెంసమ్మయ్య ఎల్లంకి సురేష్ వందమంది పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………..