* నేటి తో నామినేషన్ గడువు పూర్తి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలకు నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. నామినేషన్ చివరి రోజున బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి వెంకటగిరి విజయదుర్గ పోచమ్మ ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దీపక్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెల్సిందే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపధ్యంలో బీజేపీ అధిష్టానం మళ్లీ దీపక్ రెడ్డికే టికెట్ కేటాయించింది.
………………………………………………
