SSC Jobs
* 21 వేలకుపైగా పోస్టులు..
* 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత
SSC Jobs| ఆకేరు న్యూస్, డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా పలు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి SSC పలు నియామక ప్రకటనలు విడుదల చేసింది. అర్హతను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
CGLలో 12,256 పోస్టులు
SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO), ఆడిటర్, అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 12,256 పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
CHSLలో 2,536 ఖాళీలు
SSC కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) ద్వారా 2,536 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) వంటి పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులకు 2026 అక్టోబర్ 7 చివరి తేదీగా పేర్కొన్నారు.
ఇతర పోస్టులు ఇవే..
SSC సెలక్షన్ పోస్టులు: వివిధ విభాగాల్లో క్లర్క్, స్టెనోగ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, టెక్నికల్ స్టాఫ్ తదితర పోస్టులకు కలిపి 3,003 ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హత అవసరం.
SSC సబ్ ఇన్స్పెక్టర్: ఢిల్లీ పోలీస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (CAPF) సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 1,871 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
SSC జూనియర్ ఇంజనీర్: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో 1,748 జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా బి.టెక్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు
ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు, తాజా ఫొటో, సంతకం, వర్తించే కుల లేదా EWS ధ్రువీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే చెల్లుబాటయ్యే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అవసరం.
అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు
SSC విడుదల చేసిన ఆయా నోటిఫికేషన్లలో పేర్కొన్న అర్హతలు, వయోపరిమితి, ఫీజు, ఎంపిక విధానం, పరీక్ష తేదీలు, దరఖాస్తు గడువును అభ్యర్థులు తప్పనిసరిగా పరిశీలించాలి. అర్హత ఉన్న వారు SSC అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేసుకోవడం మంచిది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
