ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్న 42 మంది విద్యార్థులకు సౌమిత్రి రంగాచార్యులు మెమోరియల్ ట్రస్ట్ (ఎస్ ఆర్ ఎమ్ టి) ఆధ్వర్యంలో పరీక్షల కిట్లు గురువారం పంపిణీ చేశారు. రంగాచార్యులు సతీమణి కృష్ణకుమారి వారి కుటుంబ సభ్యులు లక్ష్మణ చార్యులు, రామాచార్యులు, వరుణాచార్యులు పరీక్షల కోసం పాడ్, పెన్నులు, పెన్సిల్స్, హాల్ టికెట్ కవర్ తో కూడిన కిట్లను అందించినట్లు ప్రధానోపాధ్యాయులు పెనుమాటి వెంకటేశ్వర్లు తెలియజేశారు. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు రుద్ర, లింగమూర్తి, రంజిత్ కుమార్, డి.శ్రీనివాస్, రవీందర్, ఎం.శ్రీనివాస్, మురళి, అనసూయ, కృపమ్మ, సలావుద్దీన్, పిడి గీరెడ్డి ప్రమోద్ రెడ్డి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
