
* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రజలకు పారదర్శక సేవలను అందించేందుకే రెవెన్యూ, స్టాంప్స్ &రిజిస్ట్రేషన్స్, సర్వే విభాగాల ను అనుసంధానం చేస్తున్నామని రెవెన్యూ,గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ,స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్,సర్వే విభాగం,ఎన్ఐసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ ను జతచేయాలని పేర్కొన్నందున భూభారతి పోర్టల్ కు సర్వే మ్యాప్ లింక్ చేసేలా సాఫ్ట్ వేర్‌ను అభివృద్ది పరుస్తున్నామన్నారు.భూ భారతి పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా పోర్టల్ నిర్వహణ మరింత సులభతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎన్.ఐ.సి. అధికారులకు ఆదేశించామన్నారు.కొత్తగా అభివృద్ది చేసే సాఫ్ట్‌వేర్‌లో కోర్టు కేసుల మానిటరింగ్ సిస్టమ్ ఉండేలా చూడాలని కోరారు.నక్షా లేని ఐదు గ్రామాలలో రీసర్వే కొలిక్కివచ్చిన నేపధ్యంలో మిగిలిన 408 గ్రామాల్లో త్వరలోనే రీసర్వేను ప్రారంభిస్తామని భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భూవివాదాల పరిష్కారానికి ఈ సర్వే మార్గదర్శకం కానుందని మంత్రి పొంగులేటి తెలిపారు.
…………………………………………….