
ఆకేరు న్యూస్, డెస్క్ : బెంగళూరు తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు (Highcourt) సుమోటాగా విచారణ జరపనుంది. ఈరోజు మద్యామ్నం 2.30 గంటలకు ఈ ఘటనపై విచారణ జరపనుంది. బెంగళూరులో బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై బాధ్యత వహిస్తూ.. సీఎం సిద్ధరామయ్య(Sidda ramayya), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (dk Sivakumar) పదవులకు రాజీనామా చేయాలంటూ బీజేపీ (bjp)విమర్శించింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా బెంగళూరు తొక్కిసలాటను మహాకుంభమేళా తొక్కిసలాటతో పోల్చారు. ఇలాంటి ప్రమాదాలు ఎక్కడైనా జరగొచ్చని.. కుంభమేళాలో ప్రమాదం జరిగినప్పుడు తాను ఎవరినీ విమర్శించలేదని చెప్పారు. కాగా 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ (Rayol Challengers) బెంగళూరు గెలుపొందడంతో రాష్ట్ర ప్రజలంతా పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ముఖ్యంగా కర్ణాటక సర్కారు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాట్లు చేసింది. జట్టుకు చెందిన క్రికెటర్లు అంతా అక్కడకు రాగా.. 2 నుంచి 3 లక్షల మంది అభిమానులు అక్కడకు చేరుకున్నారు. టికెట్లు లేకపోయినా స్టేడియం లోపలికి వెళ్లేందుకు ఆసక్తి చూపించారు. గేట్లు తోసేసి మరీ లోపలికి వెళ్లారు. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగింది. మొత్తంగా 11 మంది చనిపోయారు. అలాగే మరో 30 మంది వరకూ గాయపడ్డారు.
…………………………………………………