* స్పృహ కోల్పోయిన యువతి
* హాస్పిటల్ కు తరలింపు
* నిలకడగా యువతి ఆరోగ్యం
* వైద్య విద్యార్థినిగా గుర్తింపు
ఆకేరు న్యూస్ : పెద్ద ఎత్తున్న జన సమీకరణ లేదా జన సమూహం ఏర్పడే కార్యక్రమాలు ఉన్నప్పుడు తగిన చర్యలు తీసుకోకపోతే అపశృతులు జరుగుతుంటాయి. శనివారం అంతర్జాతీయ యోగా డే సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో యువతి కింద పడి స్పృహ కోల్పోయింది, వెంటనే ఆమెను సమీపంలోను కొండాపూర్ హాస్పిటల్ కు తరలించారు.గచ్చిబౌలి స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో నగర ప్రజలు హాజరయ్యారు. యోగా పూర్తి చేసిన తర్వాత గేట్ నెంబర్ 2 వద్ద బ్రేక్ ఫాస్ట్ పంపిణీ కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు. అల్పాహారం పంపిణీ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ప్రజలు గేట్ నెంబర్ 2కు వెళ్లడంతో తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఈ తోపులాటలో గాంధీ ఆస్పత్రి మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థిని స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే అనుకున్న దాని కంటే ఎక్కువ మంది రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెప్తున్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
