
* సాయంత్రం 4 గంటలకు కీలక సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అప్రమత్తమైంది. సాయంత్రం 4 గంటలకు శాంతిభద్రతలపై కీలక సమావేశం నిర్వహించనుంది. పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడుల నేపథ్యంలో చేపట్టబోయే చర్యలపై సమావేశంలో చర్చించనుంది. డిప్యూటీ సీఎం భట్టి (Batti) నేతృత్వంలో భద్రతపై సమీక్షించనున్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి సత్యనారాయణ, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సమావేశానికి హాజరుకానున్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
……………………………………