ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా ప్రారంభిస్తున్న ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలో ఇండియన్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని,మహిళ సంఘాలకు చాలా ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ములుగు జిల్లా ప్రజలు ఇండియన్ బ్యాంక్ సేవలు సద్వినియోగపర్చు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి ,ఇండియన్ బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

……………………………………………………..
