*ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలి
*ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాడికొండలో
నిర్వహిస్తున్న మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం మల్లన్న పెద్ద పట్నాల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్బంగా మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. భక్తి శ్రద్దలతో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాలో పాల్గొన్న గ్రామ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో సైతం గ్రామ ప్రజలందరూ కలిసి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, స్థానిక సర్పంచ్ మారపాక సుజనా శ్రీనివాస్, మండల మాజీ వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి, పలుగుట్ట సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
” ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం అంతకుముందు చిల్పూర్ మండలం వంగాలపల్లిలో ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్థానిక సర్పంచ్ భూక్య మేనక సుధాకర్ లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆరూరి రవిచంద్ర వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
