* కార్మికుల సంక్షేమం కోసం పోరాడాలి
– రాష్ట్ర కోశాధికారి మధు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
భవన నిర్మాణ రంగ కార్మిక సంక్షేమం కోసం కలిసికట్టుగా పోరాడాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి, కౌన్సిలర్ తాటికొండ మధు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు మీసేవ ద్వారా లేబర్ కార్డు రెన్యువల్ చేసుకోవాలని, కార్మికులంతా ఐకమత్యంతో సంక్షేమ పథకాల సాధనకై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మా భవన కార్మికులకు 10 లక్షల బైక్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నాయకులు చింత శ్రీనివాస్ మండల అధ్యక్షులు పొన్న కంటి బాబు, మండల ఉపాధ్యక్షులు కలకోల ఎల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి బట్టు ఏలియా, గ్రామ ఉపాధ్యక్షులు గోనెల రాజు, సాగ వీరయ్య, నాయకులు మేడ వెంకటస్వామి, సింగపురం చంద్రమౌళి, గుర్రం కుమార్, ఇచ్చుకోటి అంజి, సింగపురం చంద్రయ్య, దేవరాజ్ యాదగిరి, రవి, కిషన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
