* జిపి కార్మికుల సమస్యలపై సీతక్కతో చర్చిస్తా
…. ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్ పూర్:
గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలను గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చర్చిస్తానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నట్లు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు తెలిపారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
అనంతరం యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీ కార్మికులకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యేకి వివరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేస్తామని పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేస్తామని గ్రీన్ ఛానల్ ద్వారానే వేతనాలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టారని ఇప్పటివరకు అమలు చేయలేదని ఈ అసెంబ్లీ సమావేశాలలో చర్చించి ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్ పరిష్కరించేందుకు గ్రామపంచాయతీ కార్మికులకు సహకరించాలని ఎమ్మెల్యేకి వివరించినట్లు పేర్కొన్నారు.
ప్రధానంగా మార్చి 2న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఈ ఉత్తర్వులు గ్రామపంచాయతీల సిబ్బందికి వేతనాలను ఇవ్వాలని ఆదేశించడం సరైనది కాదు అందుకే రద్దు చేయాలని అన్నారు. ఆన్లైన్లో నమోదు కాని గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లను తక్షణమే నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు బెదిరింపులు కార్మికుల తొలిగింపులపై చర్యలు తీసుకోవాలని అన్నారు 2011 జనాభా ప్రకారం కాకుండా ప్రస్తుత జనాభా ఆధారంగా కార్మికుల్ని తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) జిల్లా మండల నాయకులు జీడి ఆనందం, ఉమ్మ గాని రాజేష్, కందలోజు రాజు, రాపోలు రాజకుమార్, ఇల్లందుల సారయ్య, కొయ్యడ బిక్షపతి, రామచంద్రం, సత్తు కుమార్, రాజిరెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, పెద్దులు, అజ్మత్ తదితరులు పాల్గొన్నారు.
