Shooting Ball National Selection Rutvik
Published:
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం హై స్కూల్ విద్యార్థి సంగి రుత్విక్ షూటింగ్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు. మార్చి 12, 13, 14 తేదీలలో మహబూబాబాద్ జిల్లాలో జరిగే షూటింగ్ బాల్ సబ్ జూనియర్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు జనగామ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్ తెలిపారు. రుత్విక్ ఎంపిక పట్ల జనగామ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఇనుగాల యుగేందర్ రెడ్డి, పాఠశాల హెచ్ఎం మండల విద్యాధికారి గోవర్ధన్, రాజవరం సర్పంచ్ మోటం రాజు, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభిందించారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
