Telangana Grameena Bank Opening
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మండలంలో పెద్ద గ్రామం తాటికొండకు సమీపంలో ఫతేపూర్, కృష్ణాజి గూడెం, జిట్టగూడెం, జిబి తండా, గాలి గుట్ట తండాలు ఉన్నప్పటికీ బ్యాంకు సదుపాయం లేక ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. వ్యవసాయ పనులను వదులుకొని బ్యాంకు కోసం మండల కేంద్రానికి వెళ్లేందుకు రైతులు, ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఇటీవల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు గ్రామాన్ని సందర్శించి బ్యాంకు ఏర్పాట్లపై ప్రజలతో చర్చించారు. ప్రజలకు బ్యాంక్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు తాత్కాలికంగా అద్దభవనంలో సేవలు అందిస్తామని అధికారులు చెప్పినప్పటికీ మండల మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి తన స్వంత స్థలంలో భవనాన్ని నిర్మించి తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు అద్దెకి ఇచ్చారు. దీంతో గత కొద్ది రోజులుగా బ్యాంక్ అధికారులు కొత్త భవనంలో లాకర్, క్యాష్ కౌంటర్, ఇతర కౌంటర్లు, ఖాతాదారులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. బ్యాంక్ నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు పూర్తి కావడంతో త్వరలో బ్యాంకు ను ప్రారంభించి సేవలు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
