* తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
తాడి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు పూజారి రమేష్ మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల లో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే… చిన్న పెండ్యాలకి చెందిన పూజారి రమేష్ రోజు మాదిరిగా తాటి చెట్లు ఎక్కేందుకు వెళ్ళాడు. తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న తోటి కార్మికులు చికిత్స నిమిత్తం 108 లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
చిల్పూర్ ఎస్సై నవీన్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
* మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి
ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి మృతి చెందిన పూజారి రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ తిరుపతమ్మ మాజీ ప్రజా ప్రతినిధులు, గౌడ సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
