
* భూపాలపలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: పరీక్షలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం గణపురం మండలం చెల్పూర్ జడ్పిఎస్ఎస్, అలాగే మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి రీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కలెక్టర్ అన్ని గదులను పరిశీలించారు. విద్యుత్, తాగునీరు, వైద్య తదితర మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణ పైన చీఫ్ సూపరింటెడెంట్లకు పలు సూచనలు చేశారు. పరీక్షలకు ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారనే వివరాలు, పరీక్షా కేంద్రాలోని ఏర్పాట్లును కలెక్టర్ పరిశీలించారు. పరీక్షల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన రికార్డులను, ప్రశ్న పత్రాలు, పరీక్షల అనంతరం జవాబు పత్రాల తరలింపుకు సంబంధించిన వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 21వ తేదీ నుండి ప్రారంభమైన 10వ తరగతి పరిక్షలు ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు.ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలు చాలా ప్రశాంతంగా జరిగాయని, తదుపరి జరుగనున్న పరీక్షలు కూడా ఇదే స్ఫూర్తితో పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. పరీక్షలు జరుగుతున్న తీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సెల్ ఫోన్స్, వాచీలు, ఎలక్ట్రానిక్. పరికరాలు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకురాకుండా నిశితంగా పరిశీలించాలని అన్నారు. మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్ కు పాల్పడితే మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షలు ముగిసేంత వరకు కూడా ఎంతో అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా తగిన పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య క్లోస్డ్ వాహనంలో తరలించాలని స్పష్టం చేశారు.
……………………………………