* లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే నాయిని సూచన
* హైదరాబాద్ నుంచి పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్ హనుమకొండ : మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో వర్షాలు తీవ్రంగా పడుతున్నాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇంచార్జిగా ఉన్న నాయిని హైదరాబాద్ నుంచే పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అధికారులకు,ప్రజలకు సహాయక చర్యలు అందేలా చూడాలని ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండటం అత్యంత అవసరం. అత్యవసరమైన పనులు తప్ప బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించి, అవసరమైన చోట సహాయక చర్యలు తీసుకునేలా తగు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే నాయిని సూచించారు.
…………………………………………
