* ఆ డబ్బులతో హాస్టళ్లను దత్తత తీసుకోండి
* యువతకు హరీష్‌రావు పిలుపు
ఆకేరున్యూస్, హైదరాబాద్: యువత ముందుకు వచ్చి హాస్టళ్లను దత్తత తీసుకొని పిల్లలకు సేవ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నాసరపుర కేంద్రంలోని అర్బన్ రెసిడెన్సియల్ బ్రిడ్జి స్కూల్లోని విద్యార్థులకు స్వెట్లర్లు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. డిసెంబర్ 31 దావత్లను బంద్ చేసి.. ఆ డబ్బుతో హాస్టళ్లను దత్తత తీసుకోవాలని రాష్ట్రంలోని యూత్, యువజన సంఘాలకు పిలుపునిచ్చారు. చలికాలంలో హాస్టల్లో వేడి నీళ్లు రాక, ప్రభుత్వం దుప్పట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. గత 4 నెలల నుంచి మెస్ బిల్లులు పెండిరగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండిరగ్ లేదని శాసనసభ సాక్షిగా చెప్పారని.. ఇదేనా గ్రీన్ ఛాలెంజ్ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తక్షణమే అన్నిచోట్ల మెస్ చార్జీలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
………………………………………….