
* జాతీయ రహదారి 163ని ప్రమాద రహితంగా మార్చాల్లన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం…..
* గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రజలు ప్రమాదాల బారినపడ్డారు.
* వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్న…..
* వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
ఆకేరున్యూస్, స్టేషన్ ఘనపూర్: జాతీయ రహదారి పై ప్రమాదాల నివారణతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. జాతీయ రహదారి 163పై స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని 5గ్రామాలలో ( నిడిగొండ, చాగల్, ఘనపూర్, చిన్నపెండ్యాల, కరుణాపురం) మంజూరు అయిన 5 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, నేషనల్ హైవే అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలోపర్యటించి స్థల పరిశీలన చేశారు. అలాగే చిన్నపెండ్యాల గ్రామంలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. జాతీయ రహదారి 163 హైదరాబాద్ నుండి భూపాలపట్నం రోడ్డుపైన జనగామ నుండి కరుణాపురం వరకు సరైన రోడ్ సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం వలన అనేక ప్రమాదాలు జరిగాయన్నారు. జాతీయ రహదారి 163 పైన ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి సేఫ్టీ మేజర్స్ తీసుకోవాలని అధికారులను కోరడం జరిగిందని తెలియజేసారు. అందులో భాగంగా సెంట్రల్ లైటింగ్ గ్రామాల వద్ద ఫుటోవర్ బ్రిడ్జిలు మరియు జనగామ నుండి కరుణాపురం వరకు రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గట్కరి గారి కి మరియు నేషనల్ హైవే అధికారులను కోరడం జరిగిందన్నారు. తన విజ్ఞప్తు ల పట్ల స్పందించిన అధికారులు నెల వ్యవధిలోనే చిన్న పెండ్యాల వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి పనులు పూర్తి చేశారన్నారు. నిడిగొండ, చాగల్, ఘనపూర్, చిన్నపెండ్యాల, కరుణాపురం గ్రామాల వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను 5కోట్ల 29లక్షలతో మంజూరు చేసి పనులు ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. ఆ పనులను ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మరియు నేషనల్ హైవే అధికారులతో కలిసి స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు. చాగల్ నుండి కరుణాపురం వరకు రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. సర్వీస్ రోడ్డు నిర్మాణానికి 71కోట్ల 60లక్షలతో మంజూరు వచ్చిందని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయాని తెలిపారు. రెండవ దశలో చాగల్ నుండి జనగామ వరకు సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించి అతి త్వరలో మంజూరు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడిరచారు. జాతీయ రహదారి 163 పైన ప్రమాదాలను అరికట్టాలని ప్రజలకు మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ భాను ప్రసాద్, టెక్నికల్ ఆఫీసర్ లింగయ్య, శ్రీధర్ రెడ్డి, డీఈ సతీష్ కుమార్ ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………