ఆకేరున్యూస్, నిర్మల్ జిల్లా : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరసన శనివారంతో నాలుగో రోజుకు చేరింది. అసమర్థ ఇన్చార్జి వీసీ వెంకట రమణను తక్షణమే తొలగించి యూనివర్సిటికి నూతన వీసీనీ నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన వెంకట రమణ మీద విజిలెన్స్ ఎంక్వైరీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు తెలియకుండా వెంకట రమణ అక్రమాలకు వంత పాడుతున్న ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో పర్మనెంట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు.
———————